వరుస హిట్లు అందుకుంటున్న యంగ్ హీరో

Published on Nov 9, 2019 12:00 am IST

బాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. విక్కీ డోనర్ అనే ఓ వైవిధ్యమైన కథా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అంధాధున్, చిత్రంలో నటనకు గానూ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఈయన నటించిన గత చిత్రాలు బడా హై హో, ఆర్టికల్ 15, డ్రీం గర్ల్ వరుసగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం బాలా నేడు విడుదలైంది.

బాలా చిత్రం కూడా ఓ భిన్న కథాంశంతో తెరకెక్కించారు. యుక్త వయసులోనే జుట్టు ఓడిపోవడం వలన ఓ వ్యక్తి అనుభవించే మానసిక క్షోభ, సమాజం అతని పట్ల ప్రవర్తించే తీరు, పెళ్లి, ఉద్యోగం వంటి విషయాలలో ఎదురయ్యే సమస్యలు వంటి విషయాలను కామిక్ గా చెప్పడం జరిగింది. నేడు విడుదలైన ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భూమి పెడ్నేకర్, యామి గౌతమ్ హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం :

X
More