జపాన్ లో కూడా 100 రోజులు పూర్తిచేసుకున్న ‘బాహుబలి 2’ !

గత ఏడాది విడుదలైన ‘బాహుబలి -2’ చిత్ర దేశవ్యాప్తంగా ఎన్ని కోట రికార్డులు సృష్టిచిందో తెలిసిన సంగతే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1600 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా కీర్తిని దశదిశలా వ్యాప్తి చేసింది. అలాగే ఓవర్సీస్లో సైతం టాప్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా జపాన్ దేశంలో కూడ రికార్డును నెలకొల్పింది.

గతేడాది డిసెంబర్ 29న జపాన్ లో రిలీజైన ఈ చిత్రం థియేటర్లో 100 రోజులు రన్ పూర్తిచేసుకుని సుమారు 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ ను రాబట్టి ప్రస్తుతం 15 వ వారంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా తెలిపారు. దీంతో ‘బాహుబలి-2’ ఖాతాలోమరో రికార్డ్ చేరిపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత కొంత రిలాక్స్ అయిన రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతుండగా ప్రభాస్ ‘సాహో’ పనుల్లో బిజీగా ఉన్నారు.