
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరియు తన టీం గత సంవత్సరం రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇండియన్ స్క్రీన్ పైనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలై నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.
ఈ సినిమా షూటింగ్ 2013 జూలై 6న మొదలైంది. ఇప్పటి వరకూ ఈ సినిమాలోని మేజర్ పార్ట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో మరియు కేరళ లోకేషన్స్ లో షూట్ చేసారు. తమన్నా కూడా ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యింది. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2015 ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ బాహుబలి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ అయిన భళ్లాలదేవగా కనిపించనున్నాడు. అనుష్క, తమన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.