
గత రెండున్నర ఏళ్ళుగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘బాహుబలి’. ఇన్ని రోజులు సినిమాకి సంబందించిన విషయాలను ఎంతో సీక్రెట్ గా ఉంచిన ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ దగ్గరవుతుండడంతో ఈ సినిమాకి సంబందించిన ఎన్నో విషయాలను ఇప్పుడు మీడియాకి తెలియజేస్తున్నారు. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భారీ బడ్జెట్ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ బాహుబలి సినిమాని అలనాటి స్టార్ డైరెక్టర్ కెవి రెడ్డికి అంకితం ఇస్తున్నట్లు తెలియజేశారు. 1950 – 60 లలో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన కెవి రెడ్డి అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం.
అందుకే ఆయనకి ఈ సినిమాని అంకితం ఇస్తున్నాను. అలాగే లీక్ అయిన వీడియో గురించి మాట్లాడుతూ ‘మనం ఎంతో నమ్మిన వారు మనల్ని ఇలా మోసం చేసినప్పుడు చాలా బాధ ఉంటుంది. చిన్నపిల్లల్లా ఏడవలేకపోయినా మనసుని ఎంతో బాధ పెట్టే విషయం అదని’ అన్నాడు. అలాగే కచ్చితంగా అభిమానుల పెట్టుకున్న అంచనాలను అందుకునేలా, తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటుందని తెలియజేశాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.