ఓవర్సీస్ లో’బాహుబలి’ టార్గెట్ 3 మిలియన్స్.!

Baahubali-pposter
తెలుగు చిత్ర సీమతో పాటు పక్క ఇండస్ట్రీలైన తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ గ్రాఫికల్ మానియా, పీరియాడికల్ మూవీ ‘బాహుబలి’. ఇటీవలే ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమాని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా బాహుబలి టీం క్లాక్ తో పాటు పనిచేస్తున్నారు. బాహుబలి సినిమా రైట్స్ విషయంలో ఇప్పటికే పలు రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అందులో ఒకటే తెలుగుకి సంబందించిన ఓవర్సీస్ రైట్స్ సుమారు 9 కోట్లకి పైనే అమ్ముడుపోవడం.

ఇంత పెట్టి కొన్నారు అంత రావడం కష్టమే అని చాలా మంది పెదవి విరిచారు.. కానీ తాజాగా ఓవర్సీస్ రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర రైట్స్ తీసుకున్న వారికి అప్పుడే లాభాలు వచ్చేసాయన్తున్నారు. ఈ చిత్ర బయ్యర్స్ ఓవర్సీస్ లోని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, మిగతావారికి అమ్మేయడంలో 3 కోట్ల ఆదాయం వచ్చేసింది. అనగా మొత్తం 12 కోట్లకి పైనే.. ఈ లెక్కన ఈ పెట్టువ్బాటి బ్రేక్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి లాభాలు తెచ్చి పెట్టాలంటే బాహుబలి సినిమా ఓవర్సీస్ లో సుమారు 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చెయ్యాలి.

కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ ఒక్క తెలుగు సినిమా కూడా 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చెయ్యలేదు. మరి ఈ బాహుబలి సినిమా ఏకంగా 3 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ లాభాలు తెచ్చి పెడుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే..

Exit mobile version