
ఇండియన్ సినిమా కొద్ది రోజుల క్రితమే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 100 సంవత్సరాల వేడుకని కూడా చాలా గ్రాండ్ గా చేసారు. ఇండియన్ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటర్నేషనల్ ఫేమస్ అయిన బిబిసి చానల్ తరపున సంజీవ్ భాస్కర్ ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు.
ఈ డాక్యుమెంటరీలో భాగంగా ఈ రోజు ‘బాహుబలి’ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని, హీరో రానాని ఇంటర్వ్యూ చేసారు. వీరితో పాటు ఈ చిత్ర టీంలోని చాలా మందిని ఇంటర్వ్యూ చేసారు. ఈ విషయాన్నీ బాహుబలి టీం వారు ట్విట్టర్ లో షేర్ చేసారు. ‘బిబిసికి చెందిన సంజీవ్ భాస్కర్ 100 సంవత్సరాల ఇండియన్ సినిమా గురించి డాక్యుమెంటరీ చేస్తున్నారు. అందుకోసం ఈ రోజు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, హీరో రానాలతో పాటు పలువురిని ఇంటర్వ్యూ చేసార’ ట్వీట్ చేసారు.
ప్రస్తుతం యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జరిగిన సోల్డర్ సర్జరీ వలన షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చారు. మరో నెల రోజుల్లో బాహుబలి టీం మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది.

