నిఖిల్ సినిమాకు బాహుబలి టెక్నిషియన్స్ !

నిఖిల్ సినిమాకు బాహుబలి టెక్నిషియన్స్ !

Published on Jan 30, 2018 10:33 AM IST

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహించే హీరోల్లో నిఖిల్ ఒకడు. తక్కువ కాలంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం ‘కిరాక్ పార్టీ సినిమాలో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు తరువాత నిఖిల్ తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ‘కనితన్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.

ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను తమిళ్ కనితన్ సినిమా దర్శకుడే తెలుగులో డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకు సెంధిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. బాహుబలి సినిమా తరువాత సెంధిల్ ఈ సినిమా చెయ్యడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు