తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ వసూళ్ల వివరాలు !


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రహాండమైన వసూళ్లను సాధిస్తోంది. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా మొదటి వారం ఉన్న కలెక్షన్లు రెండవ వారం కూడా అదే స్థాయిలో కొనసాగడం కష్టం. కానీ బాహుబలికి మాత్రం ఆ ఘనత సాధ్యమైంది. మొదటి వారంలో 117. 13 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రెండవ వారాల్లో కూడా అదే హవా చూపించి మరో రూ. 43 కోట్లు రాబట్టింది.

ఏరియాల ప్రకారం చూసుకుంటే అత్యధికంగా నైజాంలో రూ. 53.57 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్లో రూ. 27. 90 కోట్లు, నెల్లూరులో రూ. 6. 20 కోట్లు, గుంటూరులో రూ. 14. 80 కోట్లు, కృష్ణాలో రూ. 11. 29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10. 66 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 14. 60 కోట్లు, ఉత్తరాంధ్రలో 21. 18 కోట్లు కలిపి మొత్తంగా రూ. 160. 20 కోట్లు వసూలు చేసింది.