ఓవర్సీస్లో సైతం రూ. 100 కోట్ల దిశగా ‘బాహుబలి’ !
Published on May 5, 2017 5:05 pm IST


రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి – ది కంక్లూజన్’ కు ఓవర్సీస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శుక్రవారం ముందురోజు రాత్రి ప్రదర్శింపబడ్డ ప్రీమియర్ షోల నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. శుక్ర, శనివారాలతో కలిపి సుమారు 8.16 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ఆదివారం నాటికి 10. 13 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది.

దీంతో మూడు రోజుల కలెక్షన్ల పరంగా యూఎస్ బాక్సాఫీస్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన ఈ చిత్రం మొత్తం వారం రోజులకు కలిపి 13. 08 మిలియన్ డాలర్లు అనగా రూ. 84. 5 కోట్ల పైగానే వసూలు చేసి ఇంకొద్ది రోజుల్లో రూ. 100 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో రూ. 117. 13 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఇండియాలో విడుదలైన అని భాషల్లో కలిపి మొదటి వారానికి రూ. 534 కోట్ల నెట్ ను తన ఖాతాలో వేసుకుని కొత్త రికార్డ్ నెలకొల్పింది.

 
Like us on Facebook