తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక గ్రాఫికల్ మానియా ‘బాహుబలి’. రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బాలన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర టీం రాత్రింబవళ్ళు ఈ సినిమాని అనుకున్న టైం కి ఫినిష్ చెయ్యడానికి వర్క్ చేస్తున్నారు.
ముందుగా ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయనున్నాం అని స్వయంగా రాజమౌళి తెలిపారు. కానీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం అనుకున్న డేట్ కి వర్క్ అవ్వడాని, సినిమా జూన్ నెలాఖరుకి వెళ్తుందని అంటున్నారు. ఇదొక పీరియాడిక్ సినిమా కావడం వలన ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఉండడం వలన ఆలస్యం అవుతోందని అంటున్నారు.
టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో, భారీ సెట్స్ మరియు మతిభ్రమించే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇండియా, హాంక్ కాంగ్, యుఎస్ కి చెందిన 6 విఎఫ్ఎక్స్ టీమ్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.


