‘బాహుబలి’ తమిళ్ వెర్షన్ ఆడియో రిలీజ్ డేట్

Baahubali-tamil

తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ,మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న మొదటి భారీ విజువల్ వండర్ ‘బాహుబలి’. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత రెండున్నర ఏళ్ళుగా ఎంతో కష్టపడి చెక్కిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ ‘బాహుబలి – ది బిగెనింగ్’ జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన ప్రాత్రాలు పోషించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దాంతో సినిమా రిలీజ్ కి నాలుగు వారాల ముందు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు.

ప్రస్తుతం ఈ చిత్ర టీం ముంబైలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇది పూర్తి కాగానే సౌత్ లో ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నారు. అందులో మొదటగా తమిళంలో ఆడియో రిలీజ్ ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. తమిళ ఆడియో రిలీజ్ కోసం జూన్ 24వ తీదీని ఫైనలైజ్ చేసారు. తమిళంలో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా – యువి క్రియేషన్స్ వారు కలిసి ఈ సినేమ్ని తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ బాహుబలి ఆడియోకి తమిళ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరవుతారు. అలాగే జూన్ 27న మలయాళ వెర్షన్ ఆడియోని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ భారీ బడ్జెట్ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

Exit mobile version