తెలుగు హీరోయిన్లపై బేబీ నిర్మాత షాకింగ్ కామెంట్స్

తెలుగు హీరోయిన్లపై బేబీ నిర్మాత షాకింగ్ కామెంట్స్

Published on Feb 17, 2025 12:04 PM IST

బ్లాక్‌ బస్టర్ ‘బేబీ’ సినిమాను అందించిన టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం అందరినీ షాక్‌ కు గురిచేశాయి. ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘డ్రాగన్‌’. తెలుగులో ఈ సినిమాను ‘రిటర్న్‌ ఆఫ్‌ డ్రాగన్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా ఈ సినిమా రాబోతుంది. ఐతే, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ లో ఎస్‌కేఎన్‌ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంతకీ, ఎస్‌కేఎన్‌ ఏం మాట్లాడారు అంటే… ‘మేము తెలుగు రాని అమ్మాయిలను అభిమానిస్తాం. ఎందుకంటే.. తెలుగువచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమౌతుందో ఈమధ్యే తెలుసుకున్నాం. ఇకనుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని నేను, దర్శకుడు సాయిరాజేశ్‌ గట్టిగా నిర్ణయించుకున్నాం’’ అంటూ ఎస్‌కేఎన్‌ చెప్పుకొచ్చారు. అసలు ఎస్‌కేఎన్‌ ఈ కామెంట్స్ చేయడానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు