వచ్చే ఏడాది వేసవి వరుకు వరుసగా మెగా సినిమాలు !
Published on Nov 2, 2017 4:59 pm IST

మెగా హీరోలు అందరికి పరిచయమే. ప్రతి రెండు నెలల్లో ఎదో ఒక మెగా హీరో సినిమా విడుదల అవ్వడం మనం చూస్తున్నాం, కాని వెచ్చే నెల నుండి ప్రతినెల ఒక మెగా హీరో సినిమా విడుదల కాబోతుంది. ఏ హీరో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూద్దాం…

డిసెంబర్ 1న సాయి ధరమ్ తేజ నటించిన ‘జవాన్’ విడుదల కాబోతుంది. బివిఎస్.రవి ఈ సినిమాకు దర్శకుడు, జనవరి 10న పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల కాబోతుంది. పవన్& త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నూతన దర్శకుడు వెంకి అట్లూరి తో వరుణ్ తేజ్ చేసిన సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ కానుందని అంటున్నారు. అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ ఏప్రిల్ 27న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన ‘రంగస్థలం’ మార్చి 29 న రిలీజ్ కానుందని సమాచారం. ఇలా వచ్చే ఏడాది సగం వరుకు వరుసగా మెగా హీరోల సినిమాలు విడుదల అవుతుండడం అభిమానులకు విశేషమనే చెప్పాలి.

 
Like us on Facebook