మూడు సినిమాల్ని ముగించే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ !

Published on Jul 3, 2018 3:54 pm IST

యువ హీరో విజయ్ దేవరకొండ వరుసగా మూడు సినిమాల్ని ముగించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి ‘గీతా గోవిందం’, తమిళ దర్శకుడు, ‘ఇరుముగన్’ ఫేమ్ ఆనంద్ శంకర్ డైరెక్షన్లో మెహ్రీన్ జంటగా ద్విభాషా చిత్రం ‘నోటా’, నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో ‘టాక్సీవాలా’ అనే ఫాంటసీ థ్రిల్లర్ ను చేస్తున్నారు.

ఈ మూడు చిత్రాలు కూడ ముగింపు దశలో ఉన్నాయి. విజయ్ కూడ గ్యాప్ లేకుండా పనిచేస్తూ మూడు సినిమా పనుల్లో పాల్గొంటూ అనుకున్న సమయానికి పనుల్ని ముగించేలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ‘గీతా గోవిందం’ సినిమా ఆగష్టు 15న వస్తుందని ప్రకటించగా త్వరలోనే ‘టాక్సీవాలా, నోటా’ సినిమాల రిలీజ్ డేట్స్ రానున్నాయి. మొత్తానికి విజయ్ ఒక నాలుగు నెలల గ్యాప్ లో మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.

సంబంధిత సమాచారం :