నా కెరీర్లో కష్టమైన ప్రాజెక్ట్ బాహుబలి – పీటర్ హెయిన్స్

నా కెరీర్లో కష్టమైన ప్రాజెక్ట్ బాహుబలి – పీటర్ హెయిన్స్

Published on Jun 8, 2014 12:06 PM IST

Peter-Heins
సౌత్ ఇండియాలో స్టైలిష్ యాక్షన్ కోరియోగ్రఫీలో మంచి పేరు తెచ్చుకున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. ‘ఛత్రపతి’, ‘మగధీర’ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి తో కలిసి పనిచేసిన పీటర్ హెయిన్స్ ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాకి కూడా ఫైట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.

పీటర్ హెయిన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో బాగా కష్టమైన ప్రాజెక్ట్ ‘బాహుబలి’ అని అన్నాడు. ఈ సినిమాలో తను సుమారు 2000 మంది ఫైటర్స్ మరియు ఏనుగులను కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. ‘ఇదొక పీరియడ్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్ తో కలిసి పనిచేసాను కాబట్టి నా పనిని కాస్త సులభతరం అవుతోందని’ పీటర్ అన్నాడు.

బాహుబలి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రెండు పార్ట్స్ గా తెరకెక్కుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు