మరో అంతర్జాతీయ ఘనతను అందుకున్న బాహుబలి

Published on Jul 24, 2019 4:40 pm IST

లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో అక్టోబర్ 19న బాహుబలి మూవీ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి తో పాటు, ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి తో పాటు, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పాల్గొననున్నారు. మూవీ ప్రదర్శన అనంతరం కీరవాణి సింఫొనీ లైవ్ పెరఫార్మెన్స్ ఉంటుంది. ఆతరువాత చిత్ర యూనిట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొంటారు.

రాయల్ ఆల్బర్ట్ హాల్ ప్రఖ్యాత కళల ప్రదర్శనకు పేరుగాంచినది. 1871లో క్వీన్ విక్టోరియా దీనిని ప్రారంభించడం జరిగింది. 5544 మంది ఒకేసారి ప్రదర్శన చూడగలిగిన కెపాసిటీ ఉన్న ఈ హాల్ లో దశాబ్దాలుగా బ్రిటన్ సంప్రదాయాలకు సంబందించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంతటి ప్రఖ్యాత చరిత్ర కలిగిన వేదికపై భారతీయ సినిమా అందులోను తెలుగు వారి సినిమా ప్రదర్శనకు అర్హత పొందడం అనేది కీర్తించదగిన విషయం.

సంబంధిత సమాచారం :