“బాహుబలి” లింకప్ సెంటిమెంట్ తోనే ప్రభాస్..?

“బాహుబలి” లింకప్ సెంటిమెంట్ తోనే ప్రభాస్..?

Published on Jul 10, 2020 3:59 PM IST

ఎట్టకేలకు టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర లేచింది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై ప్రభాస్ అభిమానులు కళ్ళల్లో ఆనందం నింపింది. అయితే కేవలం ఈ ఒక్క పోస్టర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కు రెండేళ్లు ఎదురు చూపులు తప్పలేదు.

అయితే ప్రభాస్ టీం నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ మాత్రం కావాలనో లేక యాదృచ్చికంగానో తన హిస్టారికల్ హిట్ బాహుబలితో లింకప్ అయ్యాయి. తాను ఇంతకు ముందు నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో” ఫస్ట్ లుక్ మొట్ట మొదటి టీజర్ “బాహుబలి 2” విడుదల రోజునే అటాచ్ చేసి రివీల్ చేశారు.

అలాగే ఇప్పుడు చేస్తున్న మరో పాన్ ఇండియన్ ఫిల్మ్ “రాధే శ్యామ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను “బాహుబలి 1” విడుదల కాబడిన ఈరోజున విడుదల చేసారు. సో ఈ రెండు సినిమాలతో బాహుబలి సినిమా సెంటిమెంట్ గా కలిసేలా ప్రభాస్ టీం ప్లాన్ చేసిందో లేక యాదృచ్చికంగా జరిగిందో కానీ బాహుబలి సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు