
భారతదేశ అతిపెద్ద మోషన్ పిక్చర్ గా తెరకెక్కిన బాహుబలి మరో రెండు వారాలలో విడుదలకానుంది. ఈ సినిమాను జపాన్ లో జులై 11న విడుదల చేయనున్నట్లు తెలిపింది. జపాన్ వాసులకు మన తమిళ చిత్రాలంటే ఎనలేని అభిమానం. అక్కడ మన సూపర్ స్టార్ రజినీకాంత్ కి సైతం అభిమాన గణం వుండడం గమనార్హం.
ఎలాగో అక్కడ తమిళ చిత్రాలని చూసే సినీ ప్రియులు ఎక్కువ గాబట్టి బాహుబలి తమిళ వెర్షన్ ని అక్కడ విడుదల చేయనున్నారు. అక్కడ కూడా ఈ సినిమాకు ప్రచారం చెయ్యడం విశేషం. ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది. జులై 10న ఈ సినిమా విడుదల కానుంది.

