మళ్ళీ వెనక్కివెళ్లిపోయిన భైరవగీత !

Published on Dec 2, 2018 10:05 pm IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో ఆయన శిష్యుడు సిద్ధార్థ తెరకెక్కించిన చిత్రం ‘భైరవగీత’. రాయలసీమ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ , ఇర్ర మోర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈచిత్రాన్ని నవంబర్ 30న విడుదల చేయాలనుకున్నారు కానీ సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు 2.0 విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో వాయిదావేసి డిసెంబర్ 7న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కు కూడా విడుదలకావడం లేదు. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 14న విడుదల చేయనున్నామని ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.

అయితే ఈ చిత్ర కన్నడ వెర్షన్ మాత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ, భాస్కర్ రాశి సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :