బుల్లితెర పై కొనసాగుతున్న “బలగం” హవా!

బుల్లితెర పై కొనసాగుతున్న “బలగం” హవా!

Published on Nov 30, 2023 3:01 PM IST

కమెడియన్, డైరెక్టర్ వేణు దర్శకత్వం లో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా బలగం మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేసింది ఈ సినిమా. డిజిటల్ ప్రీమియర్ గా కూడా ఆడియెన్స్ ను అలరించింది. ఈ చిత్రం బుల్లితెర పై కూడా తన హవా కంటిన్యూ చేస్తోంది. ఇటీవల ఈ సినిమా టీవీ చానెల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయ్యింది.

తాజాగా అందుకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రం మరోసారి మంచి టీఆర్పీ రేటింగ్ ను రాబట్టింది. 5.38 తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా బుల్లితెర పై కూడా ఈ రెస్పాన్స్ ను అందుకోవడం చాలా అరుదు అని చెప్పాలి. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు