చాలా ఏళ్ల త‌ర్వాత మళ్లీ ‘బాలయ్య’ !

Published on Feb 26, 2020 12:44 am IST

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తోన్న న్యూస్ మాత్రం బాలయ్య ఈ సినిమాలో క‌వ‌ల‌లుగా క‌న‌ప‌డ‌బోతున్నారట. గతంలో బాలయ్య కవలలుగా నటించారు. మళ్లీ చాలా ఏళ్ల త‌ర్వాత ఈ సినిమాలో క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం.

కాగా ఈ సినిమాలో శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రియా బాలయ్య సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :