బాలయ్య అభిమానులకు శుభవార్త

Published on Jan 27, 2020 6:59 pm IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కొత్త చిత్రం చాలా రోజుల క్రితమే లాంఛ్ అయింది. కానీ కొన్ని కారణాల వలన షూట్ మొదలుకాలేదు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభిమానులు షూటింగ్ ఆలస్యం కావడంతో కొంత కంగారుపడ్డారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగి ఫిబ్రవరి 15 నుండి షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది.

బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం కోసం బాలయ్య లుక్ మార్చారు కూడ. ఇందులో క్యాథరిన్ థ్రెస ఒక కీలక పాత్ర చేయనుండగా శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More