బాలకృష్ణ -బోయపాటిల సినిమా ప్రారంభం ఎప్పుడంటే !

బాలకృష్ణ -బోయపాటిల సినిమా ప్రారంభం ఎప్పుడంటే !

Published on May 25, 2018 1:52 AM IST


నట సింహం బాలకృష్ణ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాను ఏ రోజు ప్రారభించనున్నారో తెలిసింది . జూన్ 10 న బాలకృష్ణ పుట్టినరోజున నాడు ఈ సినిమాని లాంచ్ చేయనున్నారని సమాచారం. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఇంతకుముందు బాలకృష్ణ ,బోయపాటి కలయికలో వచ్చిన సింహ ,లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు చేయనున్న ఈ సినిమా వీరికి మూడవది. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు