సీనియర్ డైరెక్టర్ తో బాలయ్య యాక్షన్ ఎంటర్ టైనర్ !

సీనియర్ డైరెక్టర్ తో బాలయ్య యాక్షన్ ఎంటర్ టైనర్ !

Published on Apr 2, 2020 6:10 PM IST

బాలయ్య బాబు – బి.గోపాల్ లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. ఆయితే అది గతం.. ప్రస్తుతం గోపాల్ ఫామ్ లో లేడు. పైగా అవుట్ డేటెడ్ డైరెక్టర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ బాలయ్య మాత్రం తాం తరువాత సినిమాని బి గోపాలే డైరెక్ట్ చెయ్యాలని పట్టు బడుతున్నాడట. దాంతో బి. గోపాల్ ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చేత ఫుల్ స్క్రిప్ట్ రాయిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సాయి మాధవ్ ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ రాసాడట.

కాగా ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెల‌లో ప్రారంభం అవుతుందట. మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో. ఇక బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు