‘కథానాయకుడు’కి డబ్బింగ్ చెప్పిన బాలయ్య !

Published on Dec 14, 2018 2:07 am IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రగా.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరో పక్క మొదటి పార్ట్ ‘కథానాయకుడు’కి సంబంధించి డబ్బింగ్ కూడా దాదాపు పూర్తి కావొస్తోంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు మినహా బాలయ్య తన పాత్రకు డబ్బింగ్ పూర్తిగా చెప్పేశారు.

కాగా ఇతర తారాగణంలో కూడా కొందరు నటులు మినహా మిగిలిన అందరూ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పారట. రానా కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ‘కథానాయకుడు’ నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా జనవరి 9న మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ విడుదల అవ్వనుంది, అలాగే జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :