గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) రీసెంట్‌గా ‘అఖండ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ, అనుకున్న స్థాయిలో పూర్తి విజయాన్ని అందుకోవడంలో ఈ మూవీ ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పుల కారణంగా ఈ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. కాగా, ఇప్పుడు ఈ చిత్ర స్క్రిప్ట్ కి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని.. ఫైనల్ స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ స్క్రిప్ట్ పై దర్శకుడు గోపీచంద్‌తో పాటు బాలయ్య కూడా పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మరి ఈసారి బాలయ్య ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.


