మరో సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

మరో సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

Published on Nov 28, 2022 8:00 AM IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే, ఇప్పుడు పరుశురామ్ తన తర్వాత సినిమాని బాలయ్య బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బాలయ్యకి పరుశురామ్ కథ వినిపించారని.. బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

మొత్తానికి పరుశురామ్ – బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 8న హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అనిల్ – బాలయ్య సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత.. పరుశురామ్ – బాలయ్య సినిమా స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు