బాలయ్యే తనకు చాలా లక్కీ అంటున్న స్టార్ హీరోయిన్ !


నందమయూరి బాలకృష్ణ చేస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’ లో స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ ఆయనకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘చెన్నకేశవ రెడ్డి, గౌతమీపుత్ర్ర శాతకర్ణి’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఈ చిత్రం కూడా హిట్టవుతుందని అందరూ భావిస్తున్నారు . అంతేగాక శ్రియ బాలకృష్ణకు లక్కీ హీరోయిన్ అని ఆమెను పొగిడేస్తున్నారు కూడ.

తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో మీరు బాకృష్ణకు లక్కీ హీరోయిన్ కదా అనే అంశం రాగానే స్పందించిన శ్రియ 100 సినిమాలు చేసిన హీరోకి నేను లక్కీ హీరోయిన్ అనడం భావ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనే నాకు లక్కీ హీరో అందామె. ఇకపోతే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ ‘పైసా వసూల్’ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.