గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 111వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ తొలుత భావించారు. కానీ, ఆ సమయంలో బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ ఉండనుండటంతో డిసెంబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని బాలయ్య అండ్ టీమ్ భావిస్తున్నారు. దీనికోసం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం ఉండేలా చూసుకోవాలని బాలయ్య చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, డిసెంబర్ రిలీజ్ విండో వైపే డిజిటల్ భాగస్వాములు కూడా మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వివిధ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ముంబై షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, సముద్రఖని, శరత్ కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.


