క్లాష్‌కు రెడీ అవుతున్న బాలయ్య-ప్రభాస్.. ఎప్పుడంటే..?

క్లాష్‌కు రెడీ అవుతున్న బాలయ్య-ప్రభాస్.. ఎప్పుడంటే..?

Published on Jun 30, 2026 1:01 AM IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలను బ్యాడ్ సీజన్‌గా భావించేవారు. పెద్ద సినిమాలేవీ ఆ సమయంలో వచ్చేవి కావు. కానీ, గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. డిసెంబరులో విడుదలైన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధిస్తుండటంతో, మేకర్స్ ఇప్పుడు ఈ నెలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. అదే బాటలో ఈ ఏడాది డిసెంబరులో ఇద్దరు బడా హీరోలు బాక్సాఫీస్ రేస్‌కు సిద్ధమవుతున్నారు.

ఒకరు రెబెల్ స్టార్ ప్రభాస్ కాగా, మరొకరు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది డిసెంబరులోనే విడుదల చేయాలని చిత్రబృందం పట్టుదలగా ఉంది. డిసెంబర్ 3 అయితే పర్ఫెక్ట్ డేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.

మరోవైపు, నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా డిసెంబరులోనే బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా దసరా కానుకగా రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కానుండటంతో ప్లాన్-బి కింద డిసెంబరు 4ని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక రోజు వ్యవధిలో ప్రభాస్, బాలయ్య సినిమాలు వస్తాయనే వార్తతో డిసెంబరు బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం జరగనుందని అభిమానులు ఆశగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు