
ఈ సంవత్సరం ‘లెజెండ్’ రూపంలో నందమూరి బాలకృష్ణ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే గా కూడా అఖండ విజయాన్ని సాధించాడు.
బాలకృష్ణ ఇకపై సినిమాలను ఎలా కొనసాగించాలనుకుంటున్నారో అలాగే తన నియోజకవర్గాన్ని కూడా అలానే డెవలప్ చేయడంపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో హిందూపూర్ ని బాగా డెవలప్ చేస్తానని మాటిచ్చాడు. అందులో భాగంగా ఇప్పటికే అధికారులతో కలిసి అక్కడ డెవలప్ చేయాల్సిన ప్లాన్ గురించి చర్చలు జరుపుతున్నారు.
ఈ విషయాన్ని దగ్గరగా ఉండి చూసిన కొంతమంది బాలకృష్ణ రియల్ లైఫ్ లో కూడా లెజెండ్ గా తన సత్తా ఏమిటో చూపించే విధంగా అడుగులు చేస్తున్నారని అంటున్నారు. అలాగే త్వరలోనే త్రిషతో కలిసి బాలయ్య నటించబోయే సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.

