‘అఖండ 2’ కోసం బాలయ్య పయనం.. ఎక్కడికంటే?

‘అఖండ 2’ కోసం బాలయ్య పయనం.. ఎక్కడికంటే?

Published on Apr 26, 2025 7:00 AM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల గోదావరి ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.

అయితే, ఈ సినిమా కోసం ప్రస్తుతం బోయపాటి జార్జియాలో లొకేషన్స్ వేట కొనసాగిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ను త్వరలోనే జార్జియాలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. బాలయ్యతో పాటు మరికొందరిపై ఇక్కడ సీన్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో చిత్ర యూనిట్ జార్జియా పయనం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు