కర్ణుడిగా బాలయ్య.. అర్జునిడిగా కళ్యాణ్ రామ్ !

Published on Nov 13, 2018 12:16 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా .. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరో మూడు రోజులపాటు అక్కడే షూటింగ్ జరగనుంది. ఈ మూడు రోజులు పాటు దానవీరశూరకర్ణ చిత్రానికి సంబంధించిన సీన్స్ ను చిత్రబృందం చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

కాగా, ఈ రోజు దానవీరశూరకర్ణ సినిమాలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటకు సంబంధించిన సీన్స్ ని షూట్ చేయనున్నారు. అయితే అర్జునుడు క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ ను రెండో రోజు చిత్రీకరించబోతున్నారు. అర్జునుడి పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే చిత్రబృందం దానవీరశూరకర్ణ చిత్రం మొదలవ్వడానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలను కూడా షూట్ చేసింది.

ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More