బాలక్రిష్ణ చేతుల మీదుగా సీనియర్ హీరో సినిమా ట్రైలర్ !
Published on Oct 16, 2017 8:57 am IST

సీనియర్ హీరో డా. రాజశేఖర్ ‘పిఎస్వి గరుడవేగ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందటంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను పొందగా ఇంకాస్త ఎక్కువగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర ట్రైలర్ ను మరొక సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నారు.

బాలక్రిష్ణ ఈ ట్రైలర్ ను రేపు 17 సాయంత్రం 8 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నారు. హీరోయిన్ గా పూజా కుమార్, ఇతర ప్రధాన తారాగణంగా కిశోర్, అలీ, శ్రద్దా దాస్, నాజర్, అవసరాల శ్రీనివాస్, పృథ్వి రాజ్ వంటి వారు నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి సన్నీ లియోనీ ఒక ప్రత్యేక గీతంలో కూడా కనిపించనుంది. చిత్రాన్ని నవంబర్ 3వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

 
Like us on Facebook