సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేయనున్న బాలయ్య ?

Published on Feb 27, 2020 10:07 am IST

మన హీరోలు తమ సినిమాలకు కొంత ప్రత్యేకతను ఆపాదించడం కోసం పాత సూపర్ హిట్ పాటలను కొత్తగా రీమిక్స్ చేస్తుంటారు. ఇప్పటివరకు యంగ్ హీరోలే ఈ ప్రయత్నాలు చేయగా ఇప్పుడు సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఆ పని చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య కొత్త చిత్రం మొదలుకానుంది. ఇది కూడా ‘సింహ, లెజెండ్’ తరహాలోనే ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటెర్టైనర్.

ఈ చిత్రం కోసం బాలయ్య తన పాత చిత్రం ‘బంగారు బుల్లోడు’ చిత్రంలోని వాన పాట ‘స్వాతిలో ముత్యమంత’ పాటను రీమిక్స్ చేయనున్నారట. ఈ పాటంటే బాలయ్య అభిమానుల్లో చాలామందికి ఇష్టం. ఈ రీమిక్స్ ఐడియాను బాలయ్యకు తమన్ ఇచ్చారట. ఈ పాటలో బాలయ్యతో అంజలి ఆడి పాడనుంది. అయితే ఈ వార్తపై చిత్ర బృందం నుండి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో మరొక కథానాయికగా శ్రియ నటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :