బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం

బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం

Published on Feb 3, 2018 7:05 PM IST

నందమూరి బాలకృష్ణ కు ఈరోజు ఉదయం సర్జరీ జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సమయంలో పోరాట సన్నివేశాలు చిరికారణ చేస్తుండగా బాలయ్య భుజానికి గాయం అయ్యింది. ఆ సమయంలో డాక్టర్స్ ను సంప్రదించిన ఫలితం లేదు. ఆయనా సరే జై సింహ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ రోజు ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి చికిత్స చేసారు. గంటపాటు ఈ సర్జరీ కొనసాగింది. తరువాత అంతా క్షేమనని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న బాలయ్య ఈ ఏడాది ఆగస్టు నుండి తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటంచబోతున్నాడు. ఇటీవల విడుదలైన బాలయ్య జై సింహ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు