బాలయ్య టాక్ షోకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చిందిగా..!

Published on Oct 27, 2021 2:07 am IST


తనదైన నటనతో, డైలాగులతో వెండి తెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ టాక్ షో ప్రోమోను చిత్రీకరించారు.

అయితే ఈ ప్రోమో ఎలా ఎలా ఉండబోతుంది? ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని బుల్లితెర మరియు బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ ప్రోమోకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు సాయంత్రం 05:10 నిమిషాలకు ఈ టాక్ షో ప్రోమో రిలీజ్ కాబోతుంది. మరీ ఈ టాక్ షోలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు, ఎలాంటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నది రేపటితో ఓ క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :