17, 18 తేదిలలో బాలకృష్ణ విశాఖ పర్యటన..

17, 18 తేదిలలో బాలకృష్ణ విశాఖ పర్యటన..

Published on Oct 16, 2014 12:42 AM IST

balakrishna
ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 17, 18 తేదిలలో విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తారు. హుధూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. అక్కడి ప్రజలకు సహాయం అందించడంతో పాటు పరామర్శించనున్నారు. రేపు (అక్టోబర్ 16) ఉదయం బాలకృష్ణ హైదరాబాద్ నుండి విశాఖ బయలుదేరి వెళ్తారు.

ఇప్పటికే హుదూద్ తుఫాను బాధితుల సహాయార్ధం 30 లక్షల రూపాయలను సియం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. అలాగే 20 టన్నుల బియ్యంతో పాటు మందులను పంపిణి చేశారు. నందమూరి ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షలు, కళ్యాణ్ రామ్ 10 లక్షల రూపాయలను సియం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు.

తాజా వార్తలు