కొత్తదనాన్ని కోరుకుంటున్న బాలయ్య

Published on Nov 19, 2019 3:00 am IST

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఒన్లీ యాక్షన్, అభిమానులకే పరిమితం అనేలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చాలని చూస్తున్నారట ఆయన. ఇకపై చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని పట్టుబడుతున్నారట. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు.

ఈ చిత్రంలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని ట్రై చేస్తేస్తున్నారట. బోయపాటి సైతం బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేస్తున్నారట. ఇది మాత్రమే కాదు ఆ తర్వాతి సినిమాలు కూడా కొత్తగా, ఈ తరం యువతను ఆకట్టుకునేలా ఉండాలని గట్టిగా భావిస్తున్నారట. మరి బాలయ్య చూపాలనుకుంటున్న కొత్తదనం ఎలా ఉంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More