బాలయ్య ఆ రీమేక్ లో నటించబోతున్నాడా ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చెయ్యబోతున్నాడు. మర్చి 29న ఈ సినిమా హైదరాబాద్ రామకృష్ణ స్టూడియో లో ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. డైరెక్టర్ తేజ ఈ సినిమాకు ఆర్టిస్ట్స్ సెలెక్షన్స్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ సినిమాతో పాటు బాలయ్య కన్నడలో మంచి విజయం సాధించిన మఫ్టి సినిమా రీమేక్ లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ లో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. బాలయ్య అనిల్ రావిపూడి, ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమాలు చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాని అవి జరగలేదు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బోయపాటితో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.