బాలకృష్ణ 100వ సినిమా కోసం ఇద్దరు దర్శకులు మధ్య పోటీ?

balakrishna1
నందమూరి బాలకృష్ణ నటించిన 99వ సినిమా ‘డిక్టేటర్’ సంక్రాంతి కానుకగా రిలీజై మాస్ ఆడియన్స్, అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి బాలకృష్ణ 100వ సినిమాపైకి షిఫ్ట్ అయ్యింది. గత కొద్ది రోజులుగా బోయపాటి శ్రీను బాలకృష్ణ 100వ సినిమా డైరెక్ట్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా బాలయ్య కెసిఆర్ ని కలిసినప్పుడు ఆయన 100వ సినిమా గురించి అడిగితే.. ఎక్కువ భాగం ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 ఉంటుందని చెప్పాడనే వార్తలు నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తోంది.

ఇదలా ఉంచితే.. తాజాగా మరో క్రేజీ పేరు బాలకృష్ణ 100వ సినిమా కోసం వినిపిస్తోంది. అతనెవరు అంటే.. తెలుగులో ఫేమస్ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్ లో పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర కూడా బాలకృష్ణ 100వ సినిమా చేయడానికి కథని సిద్దం చేసుకున్నాడు. ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఉండేలా కథని సిద్దం చేసుకున్నాడట. ఇప్పటికే ఈ కథని బాలకృష్ణకి కూడా చెప్పాడట. బాలయ్య ఈ సినిమాపై ఆలోచనలో ఉన్నాడట. మరి బాలకృష్ణ ఎవరికి 100వ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version