అత్యాధునిక పరికరాలతో బాలయ్య హాస్పటల్ నిర్మాణం !

అత్యాధునిక పరికరాలతో బాలయ్య హాస్పటల్ నిర్మాణం !

Published on Jul 18, 2018 9:52 PM IST

అమరావతిలో ‘ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్’ను నిర్మించటానికి నందమూరి బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా సీఆర్డీయే తుళ్లూరు పరిధిలోని 13.50 ఎకరాలను అలాగే అనంతపురం పరిధిలో ఓ ఎకరంన్నర స్థలాన్ని కలుపుకొని మొత్తం 15 ఎకరాలను సీఆర్డీయే హాస్పిటల్ నిర్మాణానికి కేటాయించిన విషయం తెలిసిందే.

కాగా వెయ్యి పడకల ‘ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్’ను అత్యాధునిక పరికరాలతో దేశంలోనే నెంబర్‌ వన్‌ కేన్సర్‌ హాస్పటల్‌ గా బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్ ను నిర్మించటానికి బాలయ్య తన సిబ్బందితో తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారట. ఆగష్టులో ప్రత్యేకంగా భూమిపూజ చేసి హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించడంతో పాటు మరీ పేదవారికి కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుచేసి ఆర్థిక సహాయం కూడా హాస్పటల్ ద్వారా అందించనున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు