#NBK107: థమన్ సెల్ఫీ.. బాలయ్య యంగ్ అండ్ హ్యాండ్సమ్‌ లుక్‌లో..!

#NBK107: థమన్ సెల్ఫీ.. బాలయ్య యంగ్ అండ్ హ్యాండ్సమ్‌ లుక్‌లో..!

Published on May 18, 2022 3:00 AM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 ప్రాజెక్ట్ పేరిట యాక్షన్‌ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి వచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరపరిచిన మాస్ పాటకు బాలకృష్ణకు శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. అయితే ఈ షూటింగ్ సమయంలో థమన్ తీసుకున్న ఓ సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో బాలయ్య యంగ్ అండ్ హ్యాండ్సమ్‌ లుక్‌లో కనిపిస్తుండడంతో అభిమానులు మరింత ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు