ఆకట్టుకుంటున్న “బలమెవ్వడు” కాన్సెప్ట్ టీజర్..!

ఆకట్టుకుంటున్న “బలమెవ్వడు” కాన్సెప్ట్ టీజర్..!

Published on Jul 10, 2021 6:00 PM IST

కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీకి, మెడికల్ మాఫియాా మోసాలకు అద్దం పడుతూ రూపొందుతున్న సినిమా “బలమెవ్వడు”. ధృవన్ కటకం ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా, నియా త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సుహసినీ, నాజర్, పృథ్విరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తుండగా, ఆర్ బి మార్కండేయులు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అయితే రేపు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసి, మణిశర్మకు విషెష్ తెలియచేశారు. ఇక టీజర్‌ను చూస్తుంటే పూర్వకాలంలో వైద్యాన్ని సేవగా భావించిన పుణ్యభూమి మన దేశం కానీ క్రమంగా వైద్యం వ్యాపారంగా మారింది. కార్పొరేట్ రూపు దాల్చింది. దీంతో వైద్యం కొనుక్కోలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నాణ్యమైన వైద్యం సామాన్యుడికి అందనంత దూరమైంది అనే వాస్తవాన్ని కాన్సెప్ట్ టీజర్‌లో చూపించారు. భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకం వైద్యో నారాయణో హరిని పేర్కొంటూ మెడిసిన్స్ గంగా తీర్థంలా పవిత్రంగా ఉండాలని, వైద్యుడు దేవుడితో సమానమని గుర్తు చేశారు. బలమెవ్వడు కరి బ్రోవను అనే శ్రీకృష్ణ శతక పద్యం వినిపిస్తుంటే డాక్టర్ క్యారెక్టర్స్ లో ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్ పాత్రలను పరిచయం చేశారు. మొత్తానికి ఆకట్టుకునేలా ఈ కాన్సెప్ట్ టీజర్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు