రికార్డు స్థాయి బిజినెస్ లో “అఖండ”.?

Published on May 23, 2021 3:01 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ స్థాయి అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే బాలయ్య కెరీర్ లో ఏ చిత్రానికి లేని విధంగా ఈ సినిమాపై మరో స్థాయి అంచనాలు ఉన్నాయి.

అందుకే ఈ చిత్రానికి ఓవరాల్ గా భారీ స్థాయి బిజినెస్ జరుగుతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మొత్తం థియేట్రికల్ మరియు డిజిటల్ హక్కులకు సంబంధించే 80 నుంచి 90 కోట్ల మేర బిజినెస్ ఈ చిత్రానికి జరిగినట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఆ రేంజ్ కి తగ్గట్టే ఈ సినిమాపై హైప్ ఉంది. మరి సరైన టైం చూసి దింపితే కనుక మరోసారి బాలయ్య మరియు బోయపాటి ల మాస్ ఓపెనింగ్స్ మనం చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :