బాలయ్య బాబు డైలాగ్స్‌తో రెచ్చిపోయిన రోహిణీ..!

Published on Jul 9, 2021 2:52 am IST

బుల్లి తెరపై ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించేందుకు చాలా ఛానళ్లలో చాలా కార్యక్రమాలు పోటీ పడుతున్నాయి. అయితే స్టార్ మాలో వచ్చే “స్టార్ట్ మ్యూజిక్” కూడా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూ వస్తుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్‌గా నిర్వహించే ఈ షోకు సంబంధించి తాజాగా ఈ ఆదివారానికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.

అయితే ఇందులో రోహిణీ, శివారెడ్డి మధ్య బాలయ్య బాబు డైలాగ్ వార్ నడిచింది. రోహిణీ అయితే బాలయ్య బాబు డైలాగులతో రెచ్చిపోయి దబిడి దిబిడీ చేసేసిందండోయ్. మరి ఈ బాలయ్య బాబు డైలాగ్ వార్‌తో పాటు ఈ ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉందో మిస్ కాకుండా చూడాలంటే మాత్రం ఈ ఆదివారం 12:00 గంటలకు స్టార్ మాలో వచ్చే “స్టార్ట్ మ్యూజిక్”ని మీ మీ టీవీల్లో పెట్టుకోవాల్సిందే.

సంబంధిత సమాచారం :