బాలయ్య వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అంటా ?

Published on Jan 31, 2019 1:33 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఫిబ్రవరి మూడో వారంలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారట. అందులో ఒక పాత్ర ముఖ్యమంత్రి పాత్ర అని తెలుస్తోంది. సీఎంగా బాలయ్య తీసుకునే నిర్ణయాలు రాజకీయా నాయకులకు చాలా ప్రేరణ కలిగించే విధంగా ఉంటాయని సమాచారం. పైగా ఈ చిత్రంలోని చాలా భాగం రాజకీయ నేపథ్యంలో సాగనుందట. రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ ఉంటుందట.

అలాగే బాలయ్య మహానాయకుడు లోనూ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి బాలయ్య వరుసగా రెండు సినిమాల్లోనూ రెండుసార్లు ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. ఇక బాలయ్య – బోయపాటి చిత్రం మొదటి షెడ్యూల్ లోనే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆద్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తీయనున్నాడు. గతంలో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ , లెజెండ్’ చిత్రాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవ్వడంతో ఈ కొత్త చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీరిద్దరికి ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More