కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం స్తంభించిపోయింది. అయితే కరోనా అనంతరం చిత్రనిర్మాతలు షూటింగులను తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ చాలా మంది చిత్రనిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌లను రద్దు చేస్తున్నారు. అయితే బాలయ్య – బోయపాటి సినిమా ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాల్సి ఉంది. ఆ సీక్వెన్స్ కథకు చాలా కీలకమైనవి అట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయాలి. స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం కాదు. మరి ఇప్పుడు బాలయ్య బృందం ఏమి చేస్తోందో చూడాలి. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ బాలయ్య సినిమా పై బాగానే పడింది.
ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.


