యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసిన బాలయ్య !

Published on Aug 1, 2021 10:39 pm IST

బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వస్తోన్న సినిమా ‘అఖండ’. ఇటివల తమిళనాడులో స్టార్ట్ అయిన షెడ్యూల్‌ తాజాగా పూర్తి అయిందని తెలుస్తోంది. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ ను షూట్ చేశారు. ఈ యాక్షన్ సీన్స్ ను ఫేమస్ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ డిజైన్‌ చేశాడు. ఈ సీన్స్ లో బాలకృష్ణతో పాటు ప్రగ్యా అలాగే ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారట.

కాగా ఇప్పుడు తీసిన ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ స్ ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాయట. ఇక అఖండ టీజర్ కు 60 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :