బాలయ్య తన మరో మాస్ డైరెక్టర్ కు ఓకే చెప్పేసారా?

Published on Oct 27, 2020 1:02 pm IST

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో రెండు సాలిడ్ హిట్స్ ఉండడం అలాగే ఈ కొత్త సినిమాకు సంబంధించిన టీజర్ కు కూడా భారీ రెస్పాన్స్ రావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం బాలయ్య తన మరో క్రేజీ దర్శకునితో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇంతకు ముందు బాలయ్యతో సినిమా చేసిన మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తోనే బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేయనున్నారని తెలుస్తుంది.

ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో “పైసా వసూల్” చిత్రం వచ్చి వైఫల్యం చెందింది కానీ వీరి కాంబోపై ఉన్న మ్యాజిక్ మాత్రం చెక్కు చెదరలేదు. దీనితో నెక్స్ట్ సినిమా చేసినా సరే దానిపై ఇంపాక్ట్ అలానే ఉంటుందని చెప్పాలి. మరి ఈసారి బాలయ్యతో పూరి ఎలాంటి సినిమాను ప్లాన్ చేయనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More